contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

బ్రేక్ ఫాస్ట్ ఆలస్యమైందని కోడలిని కాల్చి చంపిన మామ

టిఫిన్ ఆలస్యం కావడం ఆ ఇల్లాలి ప్రాణాన్ని బలి తీసుకుంది. టిఫిన్ చేసే వరకు ఓపిక పట్టలేని మామ సొంత కోడలిపైనే కాల్పులు జరిపి పరారయ్యాడు. మహారాష్ట్రలోని థానేలో ఈ దారుణం జరిగింది.

పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. సీమా రాజేంద్ర గురువారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేస్తోంది. ఆమె మామ కాశీనాథ్ పాటిల్ (76) ఓ వ్యాపారవేత్త. తనకు సమయానికి టిఫిన్ పెట్టలేదన్న కోపంతో లైసెన్స్ డ్ రివాల్వర్ బయటకు తీసి కోడలి పొట్ట భాగంలో కాల్చి పరారయ్యాడు. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు.

గాయపడిన సీమా రాజేంద్రను థానేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తున్న క్రమంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. ఆమె మరణించినట్టు శుక్రవారం ఉదయం వైద్యులు ప్రకటించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు పోలీసులు వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :