contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

గర్భం దాల్చిన విద్యార్థిని

శ్రీకాకుళం: ఆ బాలిక ఇంటర్ చదువుతోంది. అకస్మాత్తుగా వాంతులు చేసుకోవడంతో టీచర్లు ఆమెను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఏదో అజీర్తి వల్ల వాంతులు అయ్యాయని భావిస్తే డాక్టర్లు మాత్రం ఆమె మూడు నెలల గర్భిణీ అని చెప్పారు. దీంతో షాక్ అవ్వడం ఆ టీచర్ల వంతు అయింది. విషయం గుట్టుచప్పుడుగా ఉంచి, కప్పిపుచ్చుదామని చూశారు. విషయం ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనకు సంబంధించిన విషయాలిలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండం పొన్నాడ కేజీబీవీలో సమీప గ్రామానికి చెందిన విద్యార్థిని ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. మూడు నెలల క్రితం శ్రీకాకుళం డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన క్రీడాపోటీల్లో పాల్గొంది. ఆ సమయంలో వరుసకు బావ అయ్యే వ్యక్తి, ప్రేమ-పెళ్లి పేరుతో ఆమెను ఇబ్బంది పెట్టి అత్యాచారం చేశాడు. విషయాన్ని ఆ బాలిక గోప్యంగా ఉంచింది. యథావిధిగా సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చేసింది. రెండు రోజుల క్రితం ఆ అమ్మాయికి వాంతులు రావడం, డాక్టర్లు గర్భిణీగా తేల్చడంతో టీచర్లు అప్రమత్తమయ్యారు. విషయం బయటకు పొక్కకుండా ప్రిన్సిపాల్ శిరీష జాగ్రత్త పడ్డారు. అయితే ఆమె అంటే గిట్టని వారు రాష్ట్ర ఉన్నతాధికారులు సమాచారం చేరవేశారు. వెంటనే ప్రిన్సిపాల్ శిరీషపై వేటు పడింది. దీంతో పాటు ప్రభుత్వ హాస్టల్‌లో విద్యార్థిని గర్భం దాల్చిన ఘటనపై విచారణ జరపాలని ప్రభుత్వం కమిటీ వేసింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

తాజా వార్తలు :

మరిన్ని వార్తలు చూడండి :