contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దశాబ్దాల సీలింగ్ భూముల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు

● రేకొండ రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా..

 

కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ రైతుల దశాబ్దాల కల అయిన సీలింగ్ భూముల క్రమబద్ధీకరణ సమస్య పరిష్కారానికి కీలక అడుగులు పడుతున్నాయి. ఆదివారం రోజున మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను రేకొండ గ్రామ బాధిత రైతులు కలిసి తమ విన్నపాన్ని అందజేశారు.

◆ ప్రజా దర్బార్ హామీ దిశగా ముందడుగు

గత నెల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో రైతులు ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన అప్పుడే సానుకూలంగా స్పందించారు. వెంటనే చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీని రైతులు గుర్తు చేశారు. దీనికి కొనసాగింపుగా ఆదివారం రోజున చిగురుమామిడి మండల రైతు వేదిక వద్ద రైతులతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని,రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చించినట్లు వెల్లడించారు.

◆ 120 ఎకరాల సమస్యపై ప్రత్యేక దృష్టి

రేకొండ గ్రామ పరిధిలోని సుమారు 120 ఎకరాల సీలింగ్ భూముల సమస్యను ప్రభుత్వం పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. నిబంధనల ప్రకారం రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. మంత్రి స్పందనపై రేకొండ రైతులు హర్షం వ్యక్తం చేస్తూ,గత ప్రభుత్వాల హయాంలో పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న నమ్మకం కలిగిందని రైతులు పేర్కొన్నారు. తమ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రైతులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో విజయ్ కుమార్, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, చీల లక్ష్మారెడ్డి, గాదెపాక సునీల్, రేకొండ రైతులు పరుపాటి వెంకట్ రెడ్డి, గడ్డం కొమురయ్య, అరిగేలా రాజేందర్, బావు సుధాకర్, పొర్ల మల్లయ్య, గంగం ఆదిరెడ్డి, రాగుల సంపత్ రెడ్డి, చాడ సతీష్ రెడ్డి, అప్పల రాజయ్య, పిక్కాల శ్రీనివాస్, మామిడి చంద్రయ్య, మామిడి వెంకటయ్య, అందే సతీష్, వంగ అనిల్ కుమార్, చంచల సంజీవ్, చంచల మొండయ్య, చంచల లక్ష్మయ్య, మల్గ రాజవ్వ, కొంగుండ చేరాలు, కాశపాక వెంకటవ, పీరాళ్ళ రవీందర్ తదితరులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :