కరీంనగర్ జిల్లా: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోత్సవ పోస్టర్ ని ఆదివారం గన్నేరువరం మండల కేంద్రంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి అజయ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంబేద్కర్ యువజన సంఘం మహిళా అధ్యక్షురాలు మానకొండూరు మాజీ జెడ్పిటిసి కోండ్ర స్వరూప హాజరై మాట్లాడారు. మహనీయులు అంబేద్కర్ జయంతి ఉత్సవానికి మండలంలోని ప్రతి గ్రామం నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ జయంతి ఉత్సవ సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తప్పట్ల ఆంజనేయులు,జిల్లా అధికార ప్రతినిధి గడ్డం నాగరాజు, బుద్ధుల వాని, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ బాబు, జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఎలగందుల అనిల్, గ్రామ శాఖ అధ్యక్షులు కవ్వంపెల్లి మునేందర్,గువ్వల సత్యం, రామంచ సంపత్, న్యాత రాజేందర్,సతీష్, మహేష్, రాజయ్య పాల్గొన్నారు.








