contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పవన్ కళ్యాణ్‌ పై వ్యక్తిగత, ప్రాంతీయ విద్వేష రాజకీయాలు తగవు : వాసగిరి మణికంఠ

అనంతపురం  – గుంతకల్ : ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ఖండిస్తూ గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.

గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయనతో పాటు పట్టణ, మండల నాయకులు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొందరు ఉద్దేశపూర్వకంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ చర్యలు, అటవీ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు, పంచాయతీరాజ్ వ్యవస్థలో చేపట్టిన మార్పులు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. వాటిని ఒకే కులానికి ఆపాదించడం సరికాదన్నారు.

తెలంగాణకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌పై జరుగుతున్న విమర్శలను కూడా వారు ఖండించారు. తెలంగాణ ప్రజల పట్ల పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక గౌరవం ఉందని, కొండగట్టు దేవాలయ అభివృద్ధి, వరద బాధితులకు ఆర్థిక సహాయం, ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు.

రాజకీయ ప్రత్యర్థులను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోవాలని, వ్యక్తిగత దూషణలు, విద్వేష ప్రచారాలు సమాజానికి మంచిది కాదని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే జనసేన పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ అధ్యక్షుడు చిన్న వెంకటేశులు, మండల అధ్యక్షుడు పాటిల్ సురేష్, వీరమహిళ విభాగం నాయకురాలు రాజేశ్వరి, సీనియర్ నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, గోరంట్ల నాగయ్య రాయల్, వెంకటపతి నాయుడు, ఓబులేసు, అశ్వ నాగప్ప, హసన్, ధను, గద్దల కార్తీక్, ఫిరోజ్ నాయక్, రమేష్, రవిప్రకాశ్, గాజుల రాఘవేంద్ర, కథలవీధి అంజి, సుంకర నాగరాజు, రామాంజనేయులు యాదవ్, విజయ్, అమర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :