contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

మా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను విజయవంతం చెయ్యి స్వామి: తిరుపతి జన సైనికులు

  • వారాహి మొదలవుతుంది Paytm బ్యాచ్ డైపర్లు సిద్ధం చేసుకోండి..
  • వైసిపి నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారాహి వస్తుంది “జనసేన..

తిరుపతి:  ఈ నెల14 న అన్నవరం నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగనున్న “వారాహి యాత్ర” విజయవంతం కావాలని కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రజలపై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని తిరుపతి జనసేన నాయకులు అలిపిరి గరుడ విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కులు చెల్లించుకున్నారు..

అనంతరం జనసేన నాయకులు డా. పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్, రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర అని మా ఈ యాత్ర విజయవంతం కావాలని, రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారని,
ప్రజల మనోభావాలు గౌరవిస్తూ, ఆంధ్ర రాష్ట్రం లో ప్రజలు పడుతున్న కష్టాలను సమస్యల పరిష్కార దిశగా కొనసాగుతున్న ఈ యాత్ర జనసేన ప్రభుత్వం ఏర్పాటు వరకు కొనసాగుతుందన్నారు..

వారాహి యాత్ర ప్రారంభమైన తరువాత కొందరు వైసిపి నాయకులకు, మంత్రులకు, ముఖ్యంగా పెటియం బ్యాచ్ కు తడిచిపోవడం ఖాయమని
అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ కొడాలినాని, పేర్నినానిలు వెంటనే డైపర్లను ముందుగానే కొని పెట్టుకోవాలని , అనవసరంగా నోటికొచ్చినట్లు మా అధినేత పవన్ కళ్యాణ్ పై మాట్లాడితే  డైపర్లు మేమే మీకు కొరియర్ చేస్తామంటు హెచ్చరించారు..

త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రులతో గడపబోతున్నారని వారాహిని అడ్డుకోవాలని చూస్తే తొక్కుకుంటూ పోతామని తెలిపారు వారాహి యాత్ర తరువాత వైసీపీకి కాశీయాత్ర అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు ఆకేపాటి సుభాషిని, రాజేష్ యాదవ్, కీర్తన, మునస్వామి, ఆనంద్, లక్ష్మీ, చందన, దుర్గ, సుమన్ బాబు, కిషోర్, వినోద్, బాటసారి, మనోజ్, సుమన్, హేమంత్, రమేష్, ఆదికేశవులు, పురుషోత్తం, మోహన్, హిమవంత్, సాయి దేవ్, మణి తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :