contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రభుత్వాలు మారినా ప్రజల కష్టాలు తీరడం లేదు … మన్యంలో 16 సంవత్సరాలుగా పూర్తికాని బ్రిడ్జి పనులు !

  • వంతెన పై మూడు ముక్కల ఆటలో భాగంగా పూర్తికాని పరిస్థితి?
  • పూర్ణపాడు,లాబేసు వంతెన విషయంలో పాలకులు ఒక మాట
  • అధికారులు,కాంట్రాక్టు చెరొక మాట
  • మూడు ముక్కల ఆటలో ఎవరిదారివారిదే

పార్వతీపురం మన్యం జిల్లా : ఈ వంతెన విషయంలో 2001 జూలైలో పూర్తి చేస్తాం?,2022 జూలైలో పూర్తి చేస్తాం?, 2023 జూలైలో పూర్తి చేస్తాం?, 2024లో జూలై పూర్తి చేస్తాం? అంటూ అధికారులు ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ ప్రకటన ఇవ్వడమే తప్ప పని జరిగే పరిస్థితి లేదు, ఒక పక్క ఒరిస్సా రాష్ట్రంలో ఈ వంతెన నుండి నాగవల్లి నదిలో 5 కిలోమీటర్ల లోపు రెండు సంవత్సరాల్లో 14 పిల్లర్లతో పూర్తి చేసే పరిస్థితి ఉంది, ఏదైతే కలెక్టర్ కార్యాలయం వద్ద గ్రీవెన్స్ లో వంతెన పనులు పూర్తి చేయాలని సోమవారం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి వినతి పత్రం ఇచ్చిన మేరకు అధికారులు స్పందించి మే నెల 21 తేదీ లోపు కాంట్రాక్టర్ ను మళ్ళీ రప్పించి నిధులు విడుదల చేసి వెంటనే పనులు ప్రారంభిస్తా మని చెప్పడం చాలా సంతోషకరమైన విషయమని ఆ విధంగా వెంటనే మే 21వ తేదీ లోపు పనులు ప్రారంభించాలని లేనియెడల మే 21వ తేదీ దాటిన తర్వాతఅన్ని పార్టీలు, ప్రజా సంఘాలతోను, నాగావళి నది అవతల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబర్: 500 ప్రాప్తికి రూ. 14 కోట్లను విడుదల చేసి కాంట్రాక్టర్ కు ఇవ్వని పరిస్థితి ఇలా అయితే వంతెన పనులు ఎలా పూర్తి అవుతాయని ఆరోపించారు, తనకు రావలసిన బకాయిలు కోసం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ కాంట్రాక్టర్ తిరిగి తిరిగి నిధులు విడుదల కాకపోవడంతో గడిచిన 40 రోజులు క్రిత మూట, ముళ్ళు సర్దుకొని జెసిపిలు,లారీలు ఇతర పరికరాలు అక్కడే ఉంచేసి తన నివాసానికి వెళ్లిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు,  పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ ఎస్ ఈ చెప్పిన విధంగా ఈ వంతెన పనులు వేగవంతం చేసే విధంగా ప్రారంభించి నప్పటికీ కూడా కేవలం మూడు నెలల్లో 40 రోజులు పనిచేశారు తప్ప 75 రోజులుగా ఒక్క అడుగు ముందుకు సాగని పరిస్థితి నెలకొందన్నారు,

వంతెన పనులు 2022 డిసెంబర్ నెలలో మళ్లీ ప్రారంభించి నప్పటికీ కేవలం 20 రోజులు చేయడం జరిగిందని మిగతా 75 రోజులు తమకు బిల్లులు చెల్లించాలంటూ పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ కాంట్రాక్టర్ రావలసిన బిల్లులు కోసం తిరిగే పరిస్థితి ఇప్పటికైనా వంతెన పనులు మళ్లీ అధికారులు చెప్పిన ప్రాప్తికి మే 21వ తేదీన పున ప్రారంభించి కాంట్రాక్టర్ కి సంబంధించి పెండింగ్ ఉన్న నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేసి పనులు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పూర్ణ పాడు గ్రామం వైపు వంతెన వద్ద నుండి నాగవల్లినది లోను మరియు పనిచేసి వదిలేసిన పిల్లర్ వద్ద నుండి పత్రిక విలేకరులతో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ…. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో 31 గ్రామపంచాయతీలుగాను 9 పంచాయతీలకు 65 గిరిజన గ్రామాలతో పాటు అటు కురుపాం నియోజకవర్గంలో గల కురుపాం,గుమ్మలక్ష్మి పురం,జిఎంవలస, గరుగుబిల్లి మండలాలకు సంబంధించి బంధువులు ఇంటికి వెళ్లే ప్రజలకు మరియు అటు పాలకొండ ఏరియా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ పూర్ణపాడు వంతెన 2006లో మూడు కోట్లు 50 లక్షలు రూపాయలతో ప్రారంభించిన పనులు నేటికీ 14 కోట్ల అయినప్పుడు కూడా 50% పనులు మాత్రమే జరిగాయని మిగతా పనులు కోసం ఇదిగో నిధులు విడుదల చేస్తున్నామని, ఇటు పాలకులు అధికారులు చెప్పుతూ కాలయాపన తప్ప పనులు పూర్తిగా జరగని పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో పార్వతీపురం మన్యం జిల్లాకి కొత్తగా వచ్చిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఈ ఈ కృష్ణాజి ప్రమేయంతో పెండింగ్ పనులు 2022 డిసెంబర్ నెలలో ప్రారంభించారు, తర్వాత కాంట్రాక్టర్ కి రావలసిన నిధులు సకాలంలో రాకపోవడంతో ఈ పని 2023 జూన్ కల్లా పూర్తి చేస్తామని చెప్పినప్పుడు కూడా ఆ దిశగా ఫిబ్రవరి మార్చి నెలలో పూర్తిగా కాంట్రాక్టుకు నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో నేటికీ 75 రోజులుగా పనులు జరగని పరిస్థితి ఇలా పనులు నిలుపుదల చేస్తే మార్చి ఏప్రిల్ జూన్ నెలలో మాత్రమే ఎండాకాలం తర్వాత వర్షాలు వచ్చే పరిస్థితి ఉందని అలా వర్షాలు వస్తే మరి పని జరగని పరిస్థితి ఉంది కావున ఈ మూడు నెలల పాటు నాగావళి నదిలో ఏవైతే మూడు పిల్లర్లు తో పాటు మిగతా భాగం కూడా పని పూర్తి చేసే విధంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఎస్ ఈ కృష్ణాజి చర్యలు చేపట్టి, కాంట్రాక్టుకి నిధులు చెల్లించి ఈ వంతెన పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా పనులు వెంటనే ప్రారంభించి గిరిజన ప్రాణాలకు భరోసా కల్పించే విధంగా ఈ వంతెన పనులు మే 21 తేదీ కల్లా పనులు పున ప్రారంభించక పోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున అన్ని పార్టీలతోనూ ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :