TELANGANA

ఏసీబీ వలలో పెద్దేముల్ ఎస్ఐ చంద్రశేఖర్

వికారాబాద్- పెద్దేముల్: లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు ఎస్‌ఐ పట్టుపడ్డాడు. ఇసుక రవాణా విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో (ఎంపిటిసి) శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎసిబి అధికారులు పథకం ప్రకారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంబాపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి శ్రీనివాస్ ఇసుక రవాణా చేసుకోవాలంటే ఎస్‌ఐ చంద్రశేఖర్ రూ.50,000 డబ్బులు డిమాండ్ చేశాడు. ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా రూ.20 వేలు అడ్వాన్సుగా చెల్లించాడు. మిగితా రూ.30 ,000 కూడా ఇవ్వాల్సిందిగా ఎస్‌ఐ

Read more
CINEMA

రవితేజ కొత్త సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ

‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఇదే ఆయన తొలి సినిమా. నిన్ననే ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ, రవితేజ ఫస్టు లుక్ పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ లో రవితేజ చాలా స్టైలీష్ గా కనిపించాడు. అయితే ఆయన పాత్ర ఏమిటి? అనే ప్రశ్న అందరిలోను తలెత్తింది. ఈ సినిమాలో రవితేజ సబ్ కలెక్టర్ గా కనిపించనున్నాడట. తాజా ఇంటర్వ్యూలో

Read more
TELANGANA

మావోయిస్టులకు మరో దెబ్బ – అగ్రనేత వినోద్ మృతి

మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వినోద్ మృతి చెందాడు. మావోయిస్టు అగ్రనేత వినోద్ మరణాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ నిర్ధారించారు. వినోద్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని ఎస్పీ వెల్లడించారు. వినోద్ తలపై గతంలో చత్తీస్ గఢ్ ప్రభుత్వం రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వినోద్ తలపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది. ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కుట్రకు

Read more
TELANGANA

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ భేటీ

జోనల్ విధానానికి అడ్డంకులు తొలగిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో వేలాది ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సరికొత్త జోనల్ విధానానికి కొన్నిరోజుల కిందట రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దాంతో తెలంగాణలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ అంశమే ప్రధాన అజెండాగా ఇవాళ తెలంగాణ క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండలి సభ్యులు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. కాగా, ఈ భేటీలో ఏపీతో

Read more
AP NEWS

పెన్నా కేసులో చార్చిషీట్ నుంచి తనను తప్పించాలన్న సీఎం జగన్

సీబీఐ కోర్టులో నేడు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా కేసులో సీఎం జగన్, తదితరులు డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా చార్జిషీట్ నుంచి తన పేరు తొలగించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అటు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా చార్జిషీటు నుంచి తనను తొలగించాలని ఆమె కోరారు. సబిత డిశ్చార్జి పిటిషన్ పై కౌంటరుకు సీబీఐ అధికారులు గడువు కోరారు. సబిత డిశ్చార్జి

Read more
TELANGANA

ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసిన జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామములో హరితహారం ఏడవ విడత లో భాగంగా ఇంటి ఆవరణలో పెంచే మొక్కలను స్థానిక జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్ పంపిణీ చేశారు. గ్రామములో మహిళ సంఘం సభ్యుల సమావేశం అనంతరం మహిళలకు మొక్కలు అందజేశారు, జడ్పీటీసీ గీకురు రవీందర్ ఇంటింటికి వెళ్లి మొక్కలు అందజేస్తూ ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు, వృక్షో రక్షతి రక్షతః, మనం చెట్లను కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయని,

Read more
AP NEWS

చంద్రబాబే ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలతో లేఖ రాయించారు: ఏపీ మంత్రి అనిల్

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజా పరిణామాలపై స్పందించారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు లేఖ రాయడం వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో భయపడుతున్నారని, అందుకే తెలంగాణ ప్రాజెక్టులపై నోరెత్తడంలేదని విమర్శించారు. తాజా పరిణామాలు పరిశీలిస్తే టీడీపీ ‘తెలంగాణ దేశం పార్టీ’గా మారిపోయిన విషయం అర్థమవుతుందని అన్నారు. చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమేనని మంత్రి

Read more
TELANGANA

కరెంట్ షాక్ తో గురైన వ్యక్తి కి శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి గల్ఫ్ సేవ సమితి ఆర్థికసహాయం

కరీంనగర్ జిల్లా ది రిపోర్టర్ టీవీ తెలుగు న్యూస్ : శ్రీ లక్ష్మి నర్సింహ్మ స్వామి గల్ఫ్ సేవ సమితి బెజ్జంకి బృందం ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని గోపాల్ పూర్ కు చెందిన భూక్యా రమేష్ తన సొంత వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురయ్యాడు ఈ ప్రమాదం కాలు , చెయ్యి కోల్పోవడం జరిగింది. బతుకు జీవనం కొనసాగించడం కష్టంగా మరి పూట గడువడం ఇబ్బంది ఉన్నట్లు సోషల్ మీడియా

Read more
National

తమిళనాడును విడదీయడం ఎవరి వల్ల కాదు : కనిమొళి

త్తమిళనాడు రాష్ట్రంలోని 10 జిల్లాలను విడగొట్టి కొంగునాడు పేరుతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. పశ్చిమ తమిళనాడు ప్రాంతమైన కొంగునాడును విడదీయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీ కనిమొళి కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడును విడదీయడం ఎవరి వల్ల కాదని అన్నారు. తమిళనాడు ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కనిమొళి చెప్పారు. తమిళనాడులో ప్రస్తుతం బలమైన, సురక్షితమైన ప్రభుత్వం ఉందని

Read more
National

అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదుల అరెస్ట్.. అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో శివారులో ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఆదివారం యూపీ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 15న వీరు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల అరెస్ట్‌పై యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీప్ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులపైనా, బీజేపీ ప్రభుత్వంపైనా తనకు నమ్మకం లేదని అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు.

Read more